బాలయ్య హీరోయిన్‌ మాల్య ప్రేమలో..!

Sonal Chauhan Love With Prominent Businessman Son Siddharth Mallya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా ‘లెజెండ్‌’ చిత్రంలో నటించిన సొనాల్‌ చౌహాన్‌ గుర్తుంది కదా, అదే అమ్మడు రామ్‌ పండగ చేస్కో సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్‌కు చెందిన ఈ హాట్‌ బ్యూటీకి తెలుగులో టైం కలిసి రాలేదు. దాంతో ఆమె చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ నుండి వెళ్లి పోయింది. ఒకటి అర అవకాశాలు వచ్చినా కూడా ఆమె వాటిని తిరష్కరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రముఖ వ్యాపారవేత్త అయిన విజయ్‌ మాల్య తనయుడు సిద్దార్థ్‌ మాల్యాతో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

గత కొన్నాళ్లుగా వీరిద్దరు తెగ తిరిగేస్తున్నారు. తండ్రి మాదిరిగానే కొడుకు కూడా ఆడవారితో ఎంజాయ్‌ చేసే రకం. అందుకే గతంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ పలువురితో ఎంజాయ్‌ చేసిన ఈయన ఇప్పుడు సొనాల్‌ చౌహాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ఈసారైనా సిద్దార్థ్‌ మాల్య పెళ్లి వరకు తీసుకు వెళ్తాడా లేక మద్యలోనే ఆమెను కూడా వదిలేస్తాడా అనేది చూడాలి. మాల్యాతో ప్రేమ కారణంగా ఈ అమ్మడికి ఇటీవల మంచి ఆఫర్లే వస్తున్నాయి. తన పలుకుబడితో మాల్య ఈమెకు ఆఫర్లు ఇపిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి సినిమాల్లో అదృష్టం కలిసి రాకున్నా కూడా మాల్యను ప్రేమలో పడేసిందని హిందీ సినీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు: