రామ్ కు పోలీసులు ఫైన్.. .అందుకే

police fine to hero ram

హీరో రామ్ ప్ర‌స్తుతం ఇస్మార్ట్ శంక‌ర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సినిమాతో కాస్త ప‌ర్లేద‌నిపించుకున్న ఈయ‌న ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ తో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. జులై 18న విడుద‌ల కానుంది ఇస్మార్ట్ శంక‌ర్. తాజాగా ఈ చిత్ర షూటింగ్ చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. అక్క‌డే హీరో రామ్ తో పాటు చిత్ర‌యూనిట్ కూడా ఉన్నారు. బ‌హిరంగ ప్ర‌దేశంలో రామ్ సిగ‌రెట్ తాగుతున్న‌పుడు పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే అది సినిమా షూటింగ్ కోసమే చేసాడు రామ్. కానీ పోలీసులు మాత్రం అక్క‌డ నో స్మోకింగ్ జోన్ కాబ‌ట్టి ఫైన్ క‌ట్టాల్సిందే అని చెప్పారు. షూటింగ్ జ‌రుగుతున్న‌ట్లు ముందుగా ప‌ర్మిష‌న్ తీసుకోవాలి.. అలా తీసుకున్నా కూడా సిగ‌రెట్ స్మోకింగ్ సీన్స్ ఉన్న‌పుడు అది కూడా ముందే చెప్పాలి. అయితే ఇస్మార్ట్ శంక‌ర్ టీమ్ అలా చేయ‌క‌పోవ‌డంతో రామ్ ద‌గ్గ‌ర ఫైన్ వ‌సూలు చేసారు. ఈ క్ర‌మంలోనే 200 రూపాయ‌లు ఫైన్ క‌ట్టాడు ఈ హీరో.