కల్కి హానెస్ట్ ట్రైలర్…హిట్టు కొట్టేట్టే ఉన్నాడు

kalki trailer

యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కల్కి’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆకాశవాణి.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఈ సంభాషణ విన్న నటుడు రాహుల్‌ రామకృష్ణ.. ‘శేఖర్‌ బాబును ఎవరు చంపారు?’ అంటూ ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తుంటారు. ఈ హత్య కేసుపై ఎంక్వైరీ మొదలుపెడదాం అని రాజశేఖర్‌ చెప్పడం, ఈ నేపథ్యంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను ఉత్కంఠగా చూపించారు. ‘హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది మాత్రం రాముడే’ అని నాజర్‌.. రాజశేఖర్‌తో అనడంతో ఆయన కొడవలి పట్టి ఒక్కొక్కరినీ నరికే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. చివర్లో ‘చంపిందెవరో చెప్పాల్సింది నేను’ అని రాజశేఖర్‌ కోపంగా చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.