పిల్లలకి బండిస్తే మూడేళ్ళ జైలు… రూ.25,000 పెనాల్టీ

Three years in prison if bike given to minor

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా గుర్తుందా అందులో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు గాను వాహనదారులకు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తారు. రూ.10వేలు మొదలుకొని రూ.50వేలు, రూ.1 లక్ష వరకు ఫైన్ వేస్తారు. అయితే అది సినిమానే గా నిజ జీవితంలో అలా జరిగే చాన్స్ లేదని అనుకోకండి. ఎందుకంటే సరిగ్గా అలాంటి భారీ మొత్తాలనే త్వరలో ఫైన్లుగా విధించనున్నారు.  కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన మోటార్ వాహన చట్టాన్ని అమలులోకి తేనుంది. గతంలోనే ఈ చట్టాన్ని అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం యత్నించింది. కానీ అప్పటికే ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం ఆ చట్టం కచ్చితంగా అమలులోకి రానుంది. త్వరలో ఈ చట్టానికి చెందిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయనున్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే మోదీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాజ్యసభలో బిల్లు ఆమోదిస్తే రూల్స్ అతిక్రమించిన వారి నడ్డి విరవడం ఖాయం.
అందులో కొన్ని మచ్చుకు
* రోడ్డుపై ఎవరైనా అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వెహికల్స్‌కు దారి ఇవ్వకపోతే రూ.10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంది.
* అతివేగంతో (ఓవర్ స్పీడ్) వాహనం నడిపితే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు చెల్లించుకోవలసి వస్తుంది.
* ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 ఫైన్ కట్టాల్సిందే.
* హెల్మెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే రూ.1,000 జరిమానా ఎదుర్కోవలసి ఉంటుంది.
* మైనర్లు వాహనాన్ని నడిపితే ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. అలాగే వారి సంరక్షుడు లేదా వెహికల్ ఓనర్ మూడేళ్లపాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. రూ.25,000 పెనాల్టీ పడుతుంది.
* ఆర్‌సీ లేకుండా వాహనం నడిపితే రూ.5,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేసినా ఇదే పెనాల్టీ కట్టాలి.
* ర్యాష్ డ్రైవింగ్‌కు జరిమానా రూ.5,000. మద్యం తాగి వెహికల్ నడిపితే రూ.10,000 కట్టాలి.
* వెహికల్‌పై ఓవర్‌లోడ్‌తో వెలితే రూ.రూ.20,000 జరిమానా పడుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రూ.1,000 పెనాల్టీ.