ఏపీ మాజీ సీఎం కుటుంబానికి భద్రత తొలగింపు

Security removed former ap cm

మాజీ సిఎం, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి భద్రత తగ్గిస్తూ ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ చేరుకుంది. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న మాజీ మంత్రి , చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ కు భద్రత తగ్గించి 2+2 గన్‌మెన్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రతను పూర్తిగా తొలగించారు. సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గించడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ కు 5+5 భద్రత ఉండేది. మొత్తం 10 మంది సెక్యూరిటీ ఉండేవారు. ఇక చంద్రబాబు కుటుంబసభ్యులకు పూర్తిగా భద్రతను సమీక్షించింది ప్రభుత్వం. దేవాన్ష్ కు పూర్తిగా భద్రత తొలగించింది. కుటుంబ సభ్యులకు సైతం భద్రతను వెనక్కి తీసుకుంది ఏపీ సర్కార్. లోకేష్ ప్రస్తుతం ఎమ్మెల్సీ మాత్రమే. అందుకు తగ్గట్టుగానే భద్రత ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం. వైసీపీ సర్కార్ చంద్రబాబుపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని నేతలు మండిపడుతున్నారు.