పూరీ, రామ్‌ల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయా?

no issues between ram and puri jagannath

ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇస్మార్ట్ శంక‌ర్ అనే చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. గురువారం విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్ర రిలీజ్‌కి ముందు సినిమాపై మ‌రింత హైప్ పెరిగేలా పూరీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేశాడు. సినిమాకి సంబంధించిన న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కూడా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సినిమాని ప్ర‌మోట్ చేసుకున్నారు. అయితే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో రామ్ ఎక్క‌డ క‌న‌ప‌డ‌క‌పోయే స‌రికి గాసిప్స్ గుప్పుమ‌న్నాయి. పూరీ జ‌గ‌న్నాథ్‌కి , రామ్‌కి ప‌డ‌డం లేద‌ని ఆ కార‌ణంగా రామ్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో కూడా పాల్గొన‌డం లేద‌ని ప్ర‌చారం చేశారు. కాని విష‌య‌మేమంటే ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం ముందుగా జూలై 12న విడుద‌ల అవుతుంద‌ని అన్నారు. దీంతో రామ్ 12 త‌ర్వాత త‌న ఫ్యామిలీతో క‌లిసి స్పెయిన్ వెళ్ల‌డానికి ప్లాన్ చేసుకున్నాడు. అన్ని బుకింగ్స్ కూడా పూర్తి చేశాడు. కాని రిలీజ్ డేట్ 18కి పోస్ట్ పోన్ అయ్యే స‌రికి రామ్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌లేక‌పోయాడు. ఫ్యామిలీతో టూర్ కాబ‌ట్టి కనీసం క్యాన్సిల్ చేసుకునే అవ‌కాశం కూడా లేద‌ట‌. ఈ కార‌ణంగానే రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ ప్ర‌మోష‌న్స్ హాజ‌రు కాలేక‌పోయాడు. అంతే త‌ప్ప పూరీ, రామ్‌ల మ‌ధ్య మ‌నస్పర్థలు తలెత్తాయ‌న్న మాట అవాస్త‌వం అని ఆయ‌న‌ స‌న్నిహితులు అంటున్నారు .