బావ బావ‌మ‌రిదిలుగా బన్నీ, సుశాంత్‌..!

sushanth play key role in trivikram movie

ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌కి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. క‌థ న‌చ్చాలే గాని ఏ హీరోతో అయిన సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు మ‌న స్టార్స్‌. తాజాగా త్రివిక్ర‌మ్ .. అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌ని రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇందులో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్‌గా సుశాంత్ పాత్ర‌కి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. చిత్రంలో సుశాంత్, బ‌న్నీలు బావ బావ మ‌రిదిలుగా న‌టిస్తార‌ట‌. ఇక సుశాంత్ చెల్లెలిగా పూజా హెగ్డే, అల్లు అర్జున్ చెల్లెలిగా నివేదా పెతురాజ్ న‌టించ‌నున్నార‌ని టాక్. కుండ మార్పిడి ప‌ద్ద‌తిలో ఒకే వేదిక‌పై బన్నీ, సుశాంత్ వివాహం జ‌రిపేలా త్రివిక్ర‌మ్ ఓ సీన్‌ని ప్లాన్ చేశార‌ట‌. మంచి ఎమోష‌న్‌తో సాగే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తుంద‌ని చెబుతున్నారు. బ‌న్నీ- త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో వ‌చ్చిన జులాయి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు సూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. త‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు .