మొదలైన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌

మొదలైన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌

మల్కాజిగిరి మౌలాలిలోని రైల్వే ఇంజినీర్‌ రెజిమెంట్‌ రైల్వే టెరియర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో టెరిటోరియల్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రారంభమై నవంబర్‌ 14 వరకు కొనసాగనుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు హాజరు అవబోతున్నారు. సోల్జర్‌ జనరల్‌ క్యాటగిరీ, ట్రేడ్‌మెన్‌కు సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారికి కేటాయించిన రోజుల్లో హాజరు కావాల్సి ఉంటుంది.

6500 మంది ఒకరోజుకు పాల్గొనాల్సి ఉంది కాబట్టి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి ఇబ్బందులు జరగ కుండా స్ధానిక పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తకుండా ఇంకా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థులకు తాగు నీటి వసతి, మొబైల్‌ టాయిలెట్స్‌ వసతిని జీహెచ్‌ఎంసీ అధికారులు కల్పిస్తున్నారు.

మహారాష్ట్రకు చెందిన అభ్యర్థులు కూడా హాజరయ్యారు. గతంలో విద్యుత్‌ షాక్‌తో ఓ అభ్యర్థి రిక్రూట్‌మెంట్‌ జరిగినప్పుడు మృతి చెందాడు. అభ్యర్థులకు వైద్య సేవలు అందించడానికి అంబులెన్స్‌ ఏర్పాటు కూడా చేశారు.

భారీసంఖ్యలో అభ్యర్థులు హాజరు అవడంవల్ల వసతి కల్పించడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. టోకెన్లు ముందుగా జారీ చేసి పరీక్షలకు హాజరయ్యే రోజు అభ్యర్థులను లోనికి అనుమతిస్తున్నామని అధికారులు తెలిపారు.