టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ!

Arrest warrant issued for Tollywood actor Prithviraj!
Arrest warrant issued for Tollywood actor Prithviraj!

టాలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు పృథ్వీరాజ్ అరెస్ట్ అయినట్లు వార్తలు నిన్నటి నుంచి బాగా వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై టాలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చేసారు . అలాగే… నాన్ బెయిల‌బుల్ వారెంట్ అని అంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తనను ఎవరూ అరెస్ట్ చేయ‌లేద‌ని ఆయన స్పష్టం చేశారు.

త‌న‌పై త‌ప్పుడు వార్త‌లు రాసిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు . ఇది కుటుంబ విష‌యమని.. తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాయొద్దనిఆయన కోరారు. తన భార్యకి ఇవ్వాల్సిన భ‌ర‌ణంలో ఇప్ప‌టివ‌ర‌కు రూపాయి కూడా ఆపలేదని తెలిపారు.

Arrest warrant issued for Tollywood actor Prithviraj!
Arrest warrant issued for Tollywood actor Prithviraj!

కాగా, మనోవర్తి చెల్లింపుపై ఘటనలో కోర్టుని ఆశ్రయించారట పృథ్వి భార్య శ్రీలక్ష్మి. ఈ సందర్భంగా టాలీవుడ్‌ సినీ నటుడు పృథ్వీరాజ్ భార్య శ్రీ లక్ష్మీ వేసిన కేసుని విచారించిందట కోర్టు. ఇక పెండింగ్ లో ఉన్న మనోవర్తి బకాయి చెల్లించాలని టాలీవుడ్‌ సినీ నటుడు పృథ్వీరాజ్ కి కోర్టు ఆదేశాలు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ టాలీవుడ్‌ సినీ నటుడు పృథ్వీరాజ్..ఈ వార్తలని ఖండించారు.