జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసింది. అంతాసిద్ధం చేసిన తర్వాత రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం కీలక ప్రకటన చేశారు. అమిత్ షా ప్రకటన వెలువడిని నిమిషాల్లో రాష్ట్రపతి గెజిట్ విడుదల చేశారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర నిర్ణయంపై పీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చొక్కాలు చించుకుని తమ నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ సైతం సభ నుంచి వాకౌట్ చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు మోదీ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు తెలిపింది.
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7న జాతినిద్దేశించి ప్రసగించనున్నారు. విపక్షాల ఆందోళనపై హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌కు మూడు కుటుంబాలు దోచుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని అమిత్ షా మండిపడ్డారు. కేంద్రం నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కానుందని షా స్పష్టం చేశారు.