మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి దమ్ముంటే విదేశాలకు మాంసం ఎగుమతులను నిషేధించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రోజుకు కేవలం వంద నుంచి రెండు వందల రూపాయలు సంపాదించే వారి వ్యాపారాలను మూసివేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ ప్రభుత్వం బుల్డోజర్లతో ముస్లింల ఇళ్లు, దుకాణాలు కూల్చివేసి, తగులబెట్టడంపై ఒవైసీ మండిపడ్డారు. ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం కూల్చివేతకు పాల్పడిందని ఆయన ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లోని దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.