మ‌హారాజాస్ మ‌రో ఓట‌మి

మ‌హారాజాస్ మ‌రో ఓట‌మి

లెజెండ్స్ లీగ్ క్రికెటలో ఇండియా మ‌హారాజాస్ మ‌రో ఓట‌మి చ‌వి చూసింది. అల్ అమెరట్ వేదిక‌గా ఆసియా లయన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ప‌రాజాయం పాలైంది. 193 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన మ‌హారాజాస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 157 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. మ‌హారాజాస్ బ్యాట‌ర్లలో వ‌సీం జాఫ‌ర్‌,మ‌న్‌ప్రీత్ గొనీ ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచారు.

ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఆసియా లయన్స్ఆదిలోనే ఓపెన‌ర్లు వికెట్ కోల్పోయింది. త‌రంగా, మ‌హ్మ‌ద్ యూస‌ఫ్ క‌లిసి ఇన్నింగ్ చ‌క్క‌దిద్దారు. వీరిద్ద‌రూ ఔట‌య్యాక‌ బ్యాటింగ్‌కు వచ్చిన అస్గర్ అఫ్గాన్‌ ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డాడు. కేవ‌లం 29 బంతుల్లోనే 69 ప‌రుగులు సాధించాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు.. 7 సిక్స్‌లు ఉన్నాయి. త‌రంగా, అఫ్గాన్  ఇన్నింగ్స్‌ల‌తో ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కో్ల్పోయి 193 ప‌రుగులు చేసింది. ఇక బౌలింగ్‌లోను రెండు వికెట్లు ప‌డగొట్టి అఫ్గాన్‌ కీల‌క పాత్ర పోషించాడు.