ఆశావర్కర్ల ఛలో విజయవాడ…అడ్డుకుంటున్న పోలీసులు 

Asha workers chalo Vijayawada ..police prevention

వేతన బకాయిలు చెల్లింపు, జీతాల పెంపు జీవో అమలు డిమాండ్లతో ఆశా వర్కర్లు తలపెట్టిన ఛలో విజయవాడను పోలీసులు అడ్డుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆశావర్కర్లను అదుపులోకి తీసుకుంటున్నారు.

జగ్గయ్యపేట, కర్నూల్ జిల్లా డోన్, ఆధోనీ,నందికొట్కూరు, పాలకొల్లు విజయనగరం సహా అనేక ప్రాంతాల్లో ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఎనిమిది నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని, వేతనాల పెంపుపై ప్రకటనయితే చేశారు గానీ అది అమలుకు నోచుకోలేదని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రేడింగ్ విధానంతో తీవ్రంగా నష్టపోయామని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.