Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్నాళ్లుగా టీడీపీ వ్యతిరేక సోషల్ మీడియా ఓ విషయానికి ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మీద కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు కొన్నాళ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్నారని ఆ వార్త సారాంశం. విజయనగరం రాజకీయాల్లో మంత్రి గంటా అతి చొరవ, బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగారావు కి మంత్రి పదవి ఇవ్వడం, కుమార్తె అదితి ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సీఎం హెచ్చరించడం వంటి కారణాలతో అశోక గజపతి రాజు బాగా హర్ట్ అయ్యారని, ఇదే అదనుగా బీజేపీ ఆయనకి వల వేస్తోందని కూడా రాశారు. తనకి కేంద్రమంత్రి పదవి కొనసాగించడం, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీ టికెట్, కూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అనడంతో అశోక గజపతి రాజు కూడా టెంప్ట్ అయిపోతున్నారని కూడా ప్రచారం చేశారు.
దాదాపు 30 ఏళ్ళ నుంచి సన్నిహితులుగా మెలుగుతున్న చంద్రబాబు, అశోకగజపతి రాజు మధ్య ఎలాంటి విభేదాలు లేవని రుజువు అయ్యింది. చంద్రబాబు విజయనగరం జిల్లా పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందుకోసం పార్టీ నేతలంతా అశోకగజపతి బంగ్లాకి వచ్చారు. ఈ కాన్ఫరెన్స్ కి రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు కూడా వచ్చారు. అప్పటికే బంగ్లాలో ఉన్న కేంద్రమంత్రి అశోకగజపతి ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. పైగా రాజులిద్దరూ పక్కపక్కనే కూర్చుని చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఇటు చంద్రబాబుతో అటు సుజయ కృష్ణ రంగారావుతో అశోక్ హాయిగా మాట్లాడడం చూసిన పార్టీ నాయకులు ముక్కున వేలేసుకున్నారు.