రజనీకి మళ్లీ ఎదురుదెబ్బ

ashram matriculation school building owner locked over non-payment of rent

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

రజనీ భార్య లత కారణంగా ఆయనకు చాలాసార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పుడు మళ్లీ షాక్ తగిలింది. ఆర్థిక వ్యవహారాల్లో పూర్ అయిన రజనీ… ఆ విషయాలు కుటుంబానికే అప్పజెబుతారనే టాక్ ఉంది. అందుకు తగ్గట్లుగానే రజనీ డబ్బులన్నీ లత ఇష్టప్రకారం ఖర్చుపెడుతున్నారని, అందుకే వరుస షాకులు తగులుతున్నాయని చెన్నై సిటీలో చెప్పుకుంటున్నారు.

గతంలో కూడా పలుసార్లు అప్పులు తీసుకుని చెల్లించలేదని, అప్పులిచ్చినవాళ్లు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. చివరకు రజనీ ఆస్తులు కూడా కొన్ని తాత్కాలిక అటాచ్ కూడా చేసింది న్యాయస్థానం. ఏదోలా అప్పులు తీర్చేసి బయటపడ్డ రజనీకి తాజా వివాదం తలబొప్పి కట్టిస్తోంది. చెన్నైలో రజనీ భార్య నడుపుతున్న ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్ అద్దె చెల్లించకపోవడంతో… ఆ భవన యజమాని తాళం పెట్టాడు.

2002లో భవనం అద్దెకు తీసుకున్న రజనీ భార్య… 2013 నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారని భవన యజమాని చెబుతున్నారు. మొత్తం పది కోట్ల రూపాయల బకాయి నుంచి 2 కోట్ల బకాయిలు చెల్లించడానికి ఒప్పుకున్నారనేది ఆయన వాయిదా. కానీ మిగతా బకాయిలు మాత్రం అన్న మాట ప్రకారం కట్టకుండా బాగా ఆలస్యం చేస్తున్నారనేది ఫిర్యాదు. లత వైఖరితో రజనీకి తిప్పలు తప్పడం లేదని అభిమానులు బాథపడుతున్నారు.

మరిన్ని వార్తలు:

జగన్ కి కాస్త కొత్త మాటలు నేర్పించాలి.

జన్మభూమి బంధమే కాదు బాధ్యత కూడా…

సోనియాగాంధీ క‌నిపించ‌టం లేదు