హద్దు మీరిన బూతులు మాట్లాడుతున్న అషూ రెడ్డి

హద్దు మీరిన బూతులు మాట్లాడుతున్న అషూ రెడ్డి

బిగ్‌బాస్‌ షోలో హద్దులు మీరి ప్రవర్తించినా, బూతులు మాట్లాడినా దాన్ని ఎడిటింగ్‌లో తీసే ఆస్కారం ఉండేది. కానీ బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీలో మాత్రం అలాంటి చాన్స్‌ లేదు. 24 గంటలు లైవ్‌ స్ట్రీమింగ్‌ ఉండటంతో కంటెస్టెంట్లు ఏం మాట్లాడినా, ఏం చేస్తున్నా ప్రతీది ప్రేక్షకుడు ఓ కంట గమనిస్తూనే ఉంటాడు. అయితే నాన్‌స్టాప్‌ షోలో ఆది నుంచి వల్గర్‌ జోకులు, బూతుపురాణం నడుస్తూనే ఉంది. ఈసారి ఆ హాస్యం మరింత హద్దు మీరింది. నిన్నటి కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్కులో అఖిల్‌, బిందును ఒక టీమ్‌గా ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్‌. వీళ్లు మిగతా జోడీలకంటే బాగానే ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌కు సంచాలకురాలిగా ఉన్న అషూ మాత్రం ఎప్పటిలాగే తన నోటి దురుసు ప్రదర్శించింది.

అఖిల్‌.. మిత్ర దగ్గరకు వెళ్లి తనకు, బిందుకు రెండు యాపిల్స్‌, రెండు అరటిపండ్లు, రెండు ఆరెంజ్‌ కావాలని డీల్‌ మాట్లాడుకుంటున్నాడు. ఇది విన్న అషూ టాస్క్‌ ఆడబోతున్నారా? ఫస్ట్‌ నైట్‌కు పోతున్నారా? అంటూ సెటైర్‌ వేసింది. దీనికి అఖిల్‌ ఏమీ అనకుండా ఓ నవ్వు విసిరాడు. ఇక మరో చోట అఖిల్‌, అషూ, అజయ్‌, నటరాజ్‌ బెడ్‌ మీదకు చేరి ముచ్చట్లు పెట్టారు. ఆ సమయంలో అఖిల్‌.. అజయ్‌ చెవిలో శివ, బిందు హీరోహీరోయిన్స్‌ అంటూ ఊదాడు. దీనికి అజయ్‌ దుప్పట్లో దడదడే అంటూ కామెంట్‌ చేయగా మధ్యలో అషూ అందుకుని ముసుగులో గుద్దులాట అని మాట్లాడింది. దీంతో ఓ అడుగు ముందుకేసిన అజయ్‌ గోడకేసి గుద్దు అంటూ ఓ టైటిల్‌ ఇచ్చాడు.

ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారగా ఇంత నీచంగా మాట్లాడతారా? అని ఫైర్‌ అవుతున్నారు నెటిజన్లు. అషూ ఒక అమ్మాయి అయి ఉండి మరో ఆడదాని గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుందా? అని తిట్టిపోస్తున్నారు. ఇక నటరాజ్‌ మాస్టర్‌, అజయ్‌.. నామినేషన్స్‌ గురించి మాట్లాడుకున్నారు. హమీదా తల మీద చేయి వేసి మాట్లాడుతుంది. ఆమె తనకు అమ్మలాగా అనిపిస్తుందని, తనకోసమే నామినేట్‌ అయ్యానని అనిల్‌ బిందుతో చెప్పాడట అంటూ నటరాజ్‌ మాస్టర్‌ చెప్పుకొచ్చాడు. దీనికి అజయ్‌.. వాడు అమ్మాయి టచ్‌ కోరుకున్నాడు అని అడ్డగోలుగా ఆన్సరిచ్చాడు. దీంతో అజయ్‌ను సైతం నెట్టింట ఆడేసుకుంటున్నారు. బిందుమాధవి, హమీదాలకు కనీస మర్యాద ఇవ్వండని డిమాండ్‌ చేస్తున్నారు.