Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు, తమిళం, హిందీల్లో పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న అసిన్ గత సంవత్సరం జవరిలో ప్రముఖ వ్యాపార వేత్త అయిన రాహుల్శర్మను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. చాలా కాలం వీరిద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగిన విషయం తెల్సిందే. మైక్రోమ్యాక్స్ అధినేత అయిన రాహుల్ శర్మను వివాహం చేసుకున్న అసిన్ తాజాగా బుజ్జి పాపాయికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాహుల్ శర్మ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. తమకు దేవుడు పాపాయిని ఇచ్చి ఆశీర్వదించాడు అంటూ ట్వీట్ చేసి అందరిని ఆకర్షించాడు.
తెలుగులో ‘శివమణి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అసిన్ ‘గజిని’ చిత్రంతో బాలీవుడ్ రేంజ్లో గుర్తింపు దక్కించుకుంది. తెలుగు మరియు తమిళం గజిని చిత్రంలో నటించి మెప్పించిన అసిన్ బాలీవుడ్లో కూడా గజిని చిత్రంలో అమీర్ ఖాన్ సరసన నటించింది. ఆ చిత్రంతో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఈమె నిలిచింది. అక్షయ్ కుమార్తో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఆయన వల్లే రాహుల్ శర్మతో ప్రేమలో పడినది. అక్షయ్ కుమార్కు రాహుల్ శర్మతో మంచి స్నేహం ఉంది. రాహుల్ శర్మ, అసిన్ల ప్రేమ విషయంలో అక్షయ్ కుమార్ చాలా తోడ్పాటును అందించాడు. అసిన్ పాపాయికి జన్మనిచ్చిన నేపథ్యంలో సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు అందించారు.