Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏసీబీ ఏఎస్పీ సునీత, సీఐ మల్లికార్జున్ రెడ్డి వ్యవహారంలో పోలీసులకు వీడియో సాక్ష్యాలు లభించాయి. సునీతారెడ్డి నివాసం ఉండే ఇందూ ఫార్ట్యూన్ అపార్ట్ మెంట్ లో ఉన్న సీసీటీవీకెమెరాలో వీరిద్దరి దృశ్యాలూ లభ్యమయ్యాయి. నెలరోజులుగా వీరి రాకపోకలను పోలీసులు పరిశీలించారు. మల్లికార్జున్ సునీత ఇంటికి ఏయే సమయాల్లో, ఎన్నిసార్లు వచ్చాడన్న వివరాలను పోలీసులు సేకరించారు. సునీత, మల్లికార్జున్ ల ఆరునెలల కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలించనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురి స్టేట్ మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. సునీత భర్త సురేందర్ రెడ్డి, ఆమె తల్లి ప్రవల్లిక, పెద్దమ్మ, సురేందర్ రెడ్డి స్నేహితుడి స్టేట్ మెంట్లు తీసుకున్నారు.
మరోవైపు మల్లికార్జున్ రెడ్డితో తన భార్యకు 2016 నుంచే వివాహేతర సంబంధం ఉందని సురేందర్ రెడ్డి ఆరోపించారు. పెద్దల సమక్ష్లంలో అప్పుడు రాజీకి వచ్చామని, ఆ తర్వాత తన భార్య తనను మళ్లీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పట్లో ఆమెను క్షమించి వదిలివేయడమే తాను చేసిన నేరమని చెప్పారు. వారిద్దరిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లికార్జున్ రెడ్డి చేతిలో మరో యువతి మోసపోకుండా ఉండాలనే తాను ఇద్దరిపై నిఘా పెట్టి, రెడ్ హ్యాండెడ్ గా కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకోవడం జరిగిందని చెప్పారు.