పొగడ్తలతో ముంచెత్తిన అమిత్‌ షా

పొగడ్తలతో ముంచెత్తిన అమిత్‌ షా

ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కీలక నేతల సమక్షంలో ఆయన నామినేషన్‌ వేశారు.ఇదిలా ఉంటే.. గతంలో ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా పని చేసిన యోగి.. ఎమ్మెల్సీ కోటాలో యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గోరఖ్‌పూర్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసే ముందు గోరఖ్‌నాథ్‌ టెంపుల్‌లో పూజల్లో పాల్గొన్నారు. ఎలక్షన్‌ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో మంత్రి అమిత​ షా ర్యాలీ నిర్వహించారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో ముఠాలను యోగి తుడిచిపెట్టారని గర్వంగా చెప్తున్నా. పాతికేళ్ల తర్వాత యూపీలో న్యాయబద్ధంగా పాలన నడుస్తోంది. యోగి నాయకత్వంలో యూపీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది ’ అని షా అన్నారు.