స్పీకర్ కోడెలకు అస్వస్థత…!

Assembly Speaker Kodela Shivaprasad Was Short Illness

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో మహాత్మాగాంధీ చిత్రపటానికి స్పీకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భాగంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలను శుభ్రం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ap-speaker

ఈ సందర్భంగా క్రిస్టియన్ స్మశాన వాటిక పరిశుభ్రత కార్యక్రమంలో కోడెల ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. స్పీకర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించుకుని కోడెల ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆయన అస్వస్థతకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ap-speaker-kodela