అభిమానులకు షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన విజయ్‌దేవరకొండ…!

Vijay Devarakonda Started His Banner Titled King Of The Hill

వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్‌హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం తన ‘నోటా’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీతా గోవిందం’ చిత్రాలతో బ్లాక్‌ బస్టర్స్‌ను తన ఖాతాలో జమ చేసుకున్న విజయ్‌ అక్టోబర్‌ 5న ‘నోటా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న విజయ్‌ పారితోషికం గురించి తాజాగా చాలా చర్చలే జరిగాయి. తాను అందరిలా కాదని, సక్సెస్‌ రాగానే పారితోషికం పెంచడం తనవల్ల కాదు అంటూ తేల్చి చెప్పేశాడు.

vijay-devarkonda-banner-nam

పారితోషికం పెద్ద విషయమే కాదు అన్న విజయ్‌ తన తాజా చిత్ర ‘నోటా’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా షాకింగ్‌ ప్రకటన చేశాడు. అంతేకాకుండా ఇందుకు అనుమతినిచ్చిన నిర్మాత కేఈ జ్ఞానవేల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతకి విషయం ఏంటంటే విజయ్‌ త్వరలో నిర్మాణ రంగంలో అడుగుపెట్టబోతున్నాడు. తన బ్యానర్‌ లోగోను కూడా ఈ సందర్భంగా విడుదల చేశాడు. ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌’ అనే పేరుతో తన బ్యానర్‌ను ప్రారంభించాడు. ఇక ఈ రొమాంటిక్‌ హీరో సొంత బ్యానర్‌లో ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది చూడాలి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన తన ‘నోటా’ చిత్రం సమర్థవంతమైన నాయకులను ఎన్నుకునే దిశగా ప్రేరేపిస్తుంది తప్పితే ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా గానీ వ్యతిరేకంగా ఉండదు అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్‌ ‘నోటా’పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

vijay-speech