Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దీపావళి పండుగ భారత్ లో ఎంత ఘనంగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాడవాడలా…దీపాల కాంతులతో భారత్ ఆ రోజున వెలుగులీనుతుంది. బాణాసంచా పేలుళ్లు ఆకాశంలో చుక్కల కాంతితో పోటీపడుతుంటాయి. అలాంటి దీపావళి పర్వదినాన భారత్ వెలుగులను అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే..ఈ ఫొటో చూడాలి.
నెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ ఫొటో అంతరిక్షం నుంచి తీసినదే. ఇటలీకి చెందిన ఆస్ట్రోనాట్ పాలో నెస్పోలి ఈ ఫొటో తీశారు. 19 వతేదీన దీపావళి రోజు అంతరిక్షంలో ఉన్న పాలో, భారత్ చిత్రాన్ని తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. మిగతా ప్రపంచమంతా చీకటిగా కనిపిస్తోంటే..ఇండియా మాత్రం బాణాసంచా వెలుగులతో నిండి ఉన్న ఈ ఫొటో నెట్ లో వైరల్ అవుతోంది.