Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి మీద ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గత 48 గంటల్లో వాజ్ పేయి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా బులెటిన్ లో తెలిపారు. వాజ్పేయి ఆరోగ్య పరిస్థితిలో చాలా మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయని, ఆయన కిడ్నీలు కూడా బాగా పనిచేస్తున్నాయని ఎయిమ్స్ తమ బులెటిన్ లో పేర్కొన్నారు. మూత్రపిండం పనితీరు బాగుందని, మూత్రవిసర్జన సాధారణ స్థాయికి చేరుకుందని తెలిపారు.
ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిందని, శ్వాస మంచిగా తీసుకుంటున్నారని ఆయన బులెటిన్ లో చెప్పారు. బీపీ, హార్ట్ బీట్ సాధారణంగా ఉన్నాయని తెలిపారు. ఇతర సపోర్ట్ లేకుండానే ఇవన్నీ సాధారణంగా ఉన్నాయని చెప్పారు. రానున్న కొద్ది రోజుల్లోనే వాజ్పేయి పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అవుతారని ఎయిమ్స్ ఆస్పత్రివర్గాలు ఆశాభావం వ్యక్తంచేశాయి. మరి కొన్ని రోజుల్లో వాజ్ పేయి పూర్తిగా కోలుకుంటారని, ఆ తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.