ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లు.

Atchannaidu Introduces Kapu Reservation Bill in AP Assembly

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ బిల్లుని సభ ముందుకు తెచ్చింది చంద్రబాబు సర్కార్. బీసీ ఎఫ్ విభాగం కింద కాపులకి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి బిల్లు రూపం ఇస్తూ సభలో ప్రవేశపెట్టింది. అసెంబ్లీ లో మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుకు సంబంధించి, అచ్చెన్నాయుడు బిల్లు ప్రవేశపెడుతూ మాట్లాడిన మాటల్లో హైలైట్ పాయింట్స్ ఇవే …

 • అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
 • కాపులకు బీసీ ఎఫ్ కేటరీగా 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు –
 • తెలుగుదేశం పార్టీ అంటే సామాజిక న్యాయం –
 • పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది –
 • అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది లక్ష్యం –
 • గతంలో ఉన్న నేతలు కాపులను బీసీల్లో చేర్చకుండా చంద్రబాబుపై విమర్శలు చేశారు –
 • గతంలో ఉన్న లోపాలను తెలుసుకోకుండా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది
 • రిజర్వేషన్లను కొందరు రాజకీయం చేయడానికే వాడుకున్నారు –
 • పాదయాత్ర సమయంలో కాపుల్లో పేదవాళ్లు ఉన్నారని చంద్రబాబు గుర్తించారు.
 • పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు –
 • 2015 ఎన్నికల ప్రణాళికలో కాపు రిజర్వేషన్లను పొందుపరిచాం
 • ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. .
 • మంజునాథ కమిషన్ 20 నెలల పాటు అన్ని జిల్లాల్లో తిరిగి ది.
 • అన్ని ప్రాంతాల నుంచి మంజునాథ కమిషన్ సమాచారం సేకరించింది
 • కాపుల కోసం రూ.2,100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు
 • – బీసీ కమిషన్ నివేదికను కూలంకషంగా చర్చించాం
 • కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలను బీసీల్లో చేర్చాలని నిర్ణయించాం –
 • రాష్ట్రంలో ఏ ఊరిలో, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో సమాచారం సేకరించాం –
 • రాష్ట్రంలో కాపులు 38,09,362 మంది ఉన్నారు –
 • తెలగ 4,81,368, ఒంటరి 13,058, బలిజ 7,51,031 మంది ఉన్నారు –
 • బీసీ కమిషన్ రాష్ట్రమంతా తిరిగింది –
 • కాపుల్లో 5.8 శాతం మంది గుడిసెల్లో ఉంటున్నారు –
 • కాపు, బలిజ, ఒంటరి, తెలగ 69.3 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు –
 • కాపు, బలిజ, ఒంటరి తెలగల్లో కేవలం 5.6 శాతం మాత్రమే పట్టభద్రులున్నారు.
 • ప్రతిపక్ష పార్టీ అంటే ఆషామాషీ కాదు
 • అధికార పార్టీకి ఉన్నంత బాధ్యత ప్రతిపక్షానికీ ఉంటుంది –
 • ప్రతిపక్షం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోంది.
 • రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షం ఆరాటపడుతోంది