గణేషుని నిమజ్జనంలో దారుణం

గణేషుని నిమజ్జనంలో దారుణం

కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) పట్టణంలో జరిగిన గణేశ్ నిమజ్జనంలో దారుణం జరిగింది. చెరువులో మునిగిన ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. వీరు 8 నుంచి 12  ఏళ్ల మధ్య వయసు కలిగినవారు. కర్నాటక ముఖ్యమంత్రి ఎడియూరప్ప మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. కేజీఎఫ్ ఎస్పీ మొహమ్మద్ సుజీత్ మాట్లాడుతూ చిన్నారులు మర్దాఘాటా గ్రామ శివారులోని చెరువులో గణేశ్ నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గజ ఈతగాళ్లు చిన్నారుల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఆ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.