కేవలం రూ.70 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి చివరకు గొడ్డలితో దాడి చేసుకునేంత వరకు దారి తీసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ధంసలాపురంలోని కొత్తకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కొమ్ము ఉప్పలయ్య సమీప బంధువైన కొమ్ము కోటయ్యకు రూ.70 ఎప్పుడో ఇచ్చాడు.
అయితే తనకివ్వాల్సిన రూ.70 కోసం బుధవారం రాత్రి అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. స్థానికులు సర్దిచెప్పి పంపించారు. అయినా అది మనస్తాపంలో పెట్టుకుని ఇంటికెళ్లాక కోటయ్య కుమారుడు అశోక్‌కు తెలిసి అతను గొడ్డలి తీసుకెళ్లి ఉప్పలయ్యపై దాడి చేశాడు. భుజానికి తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరాడు. గురువారం పోలీసులకు ఫిర్యాదు అందింది.