బండ రాయితో మోది యువకుడిపై దాడి చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కేసును మోమిన్‌పేట పోలీసులు ఛేదించారు. శుక్రవారం సీఐ వెంకటేశం కేసు వివరాలు వెల్లడించారు. నవాబ్‌పేట మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన చిన్నమల్కు శివశంకర్ కు వెల్దుర్తి గ్రామానికి చెందిన శివలీలతో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, కూమార్తె ఉన్నారు. శివశంకర్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో విసుగు చెందిన శివలీల ఏడాది క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లిగారింటి పక్కనే ఉన్న జహంగీర్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఇదిలా ఉండగా ఏడు నెలల క్రితం శివలీల భర్త శివశంకర్ వద్దకు వచ్చింది. అప్పుడప్పుడు జాహంగీర్ శివలీల వద్దకు వచ్చిళ్తుండేవాడు. ఇది గమనించిన శివశంకర్ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఇది తట్టుకోలేక శిశలీల ప్రియుడు జాహంగీర్‌తో భర్తను హత్య చేసేందుకు పథకం పన్నారు. పథకం ప్రకారం ఈ నెల 26న జహింగీర్.. శివశంకర్‌ను తన స్కూటీపై తీసుకువెళ్లి మద్యం తాగించాడు. అనంతరం నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లి తలపై రాళ్లతో బాదాడు. ఈ విషయమై శివలీలకు చెప్పి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు.
కొన ఊపిరితో ఉన్న శివశంకర్‌ను మరుసటి ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదే రోజు చికిత్స పొందుతూ శివశంకర్ మృతి చెందాడు. మృతుడి అక్క సునంద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో భార్య శివలీల ఫోన్ తీసుకొని విచారణ చేపట్టగా హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఆమె వెల్లడించింది. ఈ మేరకు శివలీల, జహంగీరును ఆదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించినట్లు సీఐ వెంకటేశం తెలిపారు