ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు జరిమానా చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు కోరడంతో ఆ జరిమానా చెల్లించాక రశీదు కోసం పట్టుబట్టడంతో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను దాడి చేసి అరెస్టు చేసినందుకు థానే ట్రాఫిక్ పోలీసుల మీద చర్యలు తీసుకున్నారు.
మహారాష్ట్ర లోని థానే పట్టణంలో జరిగిన ఈ ఘటనపై హోంమంత్రి (పట్టణ) రాష్ట్ర మంత్రి డాక్టర్ రంజిత్ పాటిల్ విచారణకు ఆదేశించారు. అందుతున్న సమాచారం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు గాను ఒక వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.
ఆ జరిమానా కతతిన్ అతను రశీదు కోరినప్పుడు, పోలీసులు అతని మీద దాడి చేశారు. అలాగే ఆ తర్వత అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఈ విషయం మీద థానే పోలీసుల నుండి సంతృప్తికరమైన సమాధానం రాకపోవదంతో అతను మంత్రికి కంప్లైంట్ చేశారు.
ఆ తర్వాత అతని మీద ట్రాఫిక్ పోలీసులు డి చేశారు. అసలు ఏమైనదంటే ఆగస్టు 2 న రాత్రి 7 గంటల సమయంలో శశికాంత్ తివారీ (37) ఆఫీస్ నుండి ఇంటికి వెళుతుండగా తానే-బేలాపూర్ రహదారి వద్ద దిఘా గ్రామంలో పెట్రోల్ కొట్టించడానికి రాంగ్ రూట్ లో వెళ్ళాడు.
దీంతో ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపమని కోరారు. డ్రైవింగ్ లైసెన్స్ చూపమని కోరితే సదరు వ్యక్తి చూపించాడు ఆ తర్వాత దాన్ని తనిఖీ చేసిన తరువాత 1,700 రూపాయలు (హెల్మెట్ లేకుండా స్వారీ చేయడానికి 1,200 రూపాయలు మరియు తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి 500) దానికి అదనంగా 2,200 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని శశికాంత్ ని కోరారు.
ఈ క్రమంలో ఆయన వారికి రూ .2,500 ఇచ్చాడు, అవే తనవద్ద ఉన్నాయని చెప్పి దానికి వారి నుండి రశీదు డిమాండ్ చేశారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ యంత్రం పనిచేయడం లేదని చెప్పారు. అయితే తను ఇంటర్నెట్ లో చెల్లిస్తానని చెబితే వారు నిరాకరించారట. అది గొడవకు దారి తీసి అతని మీద దాడి చేసినట్టు చెబుతున్నారు.