తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై జరిగిన దాడి తన అభిమానుల్లో మరియు బుల్లితెర రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి అందరికీ తెలిసిందే.రాహుల్ పై తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువుగా చెప్పబడుతున్న రితేష్ రెడ్డి సహా అతని అనుచరులు అమానుషంగా దాడి చేసిన దృశ్యాలు వైరల్ అయ్యిపోయాయి.ఇదిలా ఉండగా మరోపక్క తప్పు రాహుల్ దే అంటూ మరిన్ని వార్తలు సర్క్యులేట్ కాగా వాటన్నిటికీ రాహుల్ చెక్ చెప్తూ పోలీస్ కంప్లైట్ చేసాడు.అసలు పబ్ లో ఏం జరిగింది అన్నది రాహుల్ పోలీస్ కంప్లైట్ ఇచ్చిన అనంతరం మీడియా సమక్షంగా తెలిపారు.
తాను తన బ్యాండ్ కు చెందిన లేడీ గ్రూప్ ఫ్రెండ్స్ తో గచ్చిబౌలి ప్రిజమ్ పబ్ కు వెళ్లానని అలా వెళ్లగా అక్కడ అప్పటికే ఉన్న యువత తనని పాట పాడమనగా పాట కూడా పాడానని కానీ రితేష్ రెడ్డి సహా మొత్తం ఒక పది మంది బ్యాచ్ వారి స్నేహితులు నా స్నేహితురాల్లతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారని దానితో కావాలనే వారంతా ఏదో రుబాబు చూపించాలి అన్నట్టు కలిసి దాడి చేసారని రాహుల్ తెలిపాడు.నేను ఇప్పుడు వాడిని హౌలా గాడు అనకపోతే జనం అంతా నన్ను హౌలా గాన్ని అనుకుంటారని ఎక్కడా తగ్గకుండా రాహుల్ మాట్లాడాడు.తనపై దాడి చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని అసలు విషయాన్ని రాహుల్ వెల్లడించారు.