భర్త ఎదుటే భార్యపై…పట్టించుకోని పోలీసులు

భర్త ఎదుటే భార్యపై...పట్టించుకోని పోలీసులు

జిల్లాలోని వెలుగోడు మండలం జమ్మినగర్ తండాలో దారుణం జరిగింది. కొందరు దుండగులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తను లాక్కెళ్లిన నలుగురు దుండగులు అతన్ని చితకబాదారు. అతని ఎదుటే భార్యపై అఘాయిత్యం చేశారు.

అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి బంధువులు ఆరోపించారు. గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు వెలుగోడు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

వెలుగోడు మండలం జిమ్మినగర్‌ తండాలో జరిగిన మహిళపై దుండగుల సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర మహిళా కమీషన్ ఆరా తీసింది. జిల్లా ఎస్పీతో మాట్లాడిన మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.