Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియన్ సూపర్ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న రజినీకాంత్ గత కొంత కాలంగా సక్సెస్‌ల కోసం యువ హీరోల మాదిరిగా ఎదురు చూస్తున్నాడు. ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలు డిజాస్టర్స్ అవ్వడంతో ఈయన తీవ్రంగా నిరాశ పర్చాడు. ‘లింగ’ చిత్రం నుండి కూడా వరుసగా చేసిన సినిమాలు అన్ని కూడా విఫలం అవుతు వస్తున్న కారణంగా అభిమానులు కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రజినీకాంత్ సినిమాల ఎంపిక విషయంలో గతంతో పోల్చితే సరైన శ్రద్ద తీసుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘కబాలి’ సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో మళ్లీ అదే దర్శకుడితో ‘కాలా’ చిత్రం చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అప్పుడే అంతా ప్రశ్నించారు. కాని రజినీకాంత్ మాత్రం పట్టించుకోలేదు.
తాజాగా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో రంజిత్ పాకు రెండవ ఛాన్స్ ఇచ్చినందుకు బాధపడుతున్నాడు. తాజాగా ‘పిజ్జా’ వంటి చిన్న చిన్న చిత్రాలతో దర్శకుడిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కేవలం పారితోషికం కోసం అన్నట్లుగా రజినీకాంత్ సినిమాలు చేస్తున్నాడు అని, శ్రద్దగా సినిమాలు చేయాలని ఆయన అనుకోవడం లేదు అంటూ స్వయంగా ఆయన అభిమానులు అంటున్నారు. సినిమాలకు స్వస్థి చెప్పి, సూపర్‌స్టార్ బ్రాండ్ ఇమేజ్‌ను అలాగే ఉంచుకుంటే గౌరవ ప్రథంగా ఉంటుందని, ఖచ్చితంగా రజిని ఇంకా సినిమాలు చేస్తాను అంటే మంచి కథలతో మంచి దర్శకుతో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరో వైపు రజినీకాంత్ రాజకీయాలు అంటూ తిరుగుతున్నాడు. మరి ఆయన ఎప్పటికి రాజకీయాల్లోకి వస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.