సోషల్ మీడియా జోరు పెరిగాక ఈ కుల సంబంధిత చర్చలు, వాదోపవాదాలు మరీ ఎక్కువైపోయాయి. తాజాగా బిగ్ బాస్ షో మొదలైన నేపథ్యంలో అందులో పార్టిసిపెంట్ల కులాల గురించి ఇప్పుడు చర్చ నడుస్తుండటం గమనార్హం.
యాంకర్ లాస్య హౌస్లోకి అడుగు పెట్టగానే ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిందని.. ఆమెకు సపోర్ట్ చేద్దామని ఒక వర్గం వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. మరోవైపు గంగవ్వ మున్నూరు కాపు అని.. ఆమెను గెలిపించుకుందామని ఇంకో వర్గం ప్రచారం మొదలుపెట్టింది.
మిగతా పార్టిసిపెంట్లలో కొందరి కులాలు కూడా వెలికితీసే ప్రయత్నం జరిగింది. ఇది చూసి తెలుగు రాష్ట్రాల జనాల్లో కుల పిచ్చి ఈ స్థాయికి చేరిందేంటంటూ విజ్ఞులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మనవాళ్లు మారరని, ఈ జాఢ్యం ఎప్పటికి వదులుతుందో అని నిట్టూరుస్తున్నారు.