Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటకలో ఓ వరలక్ష్మి పూజ ఎంత ఆడంబరంగా జరిగిందో ఇప్పటికే సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. అంతగా ప్రచారం జరగడానికి ఆ పూజలో అక్షరాలా 73 లక్షల రూపాయలు, భారీగా బంగారం పెట్టి మరీ చేయడమే కారణం. అందుకు సంబంధించిన ఫోటో బయటికి వచ్చినప్పుడు ఇదేదో ఓ మంత్రి గారి ఇంటిలో జరిగిందని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని తేలింది. ఈ పూజ జరిగింది ఓ ఆటో డ్రైవర్ కొడుకు ఇంటిలో. అదెలాగంటే …
వరలక్ష్మి పూజని ఇంత ఘనంగా చేసిన వ్యక్తి పేరు సూరి. ఆయన తండ్రి కృష్ణప్ప ఓ ఆటో డ్రైవర్. అయితే సూరి ఎక్కివచ్చాక రూట్ మార్చుకున్నాడు. బెంగుళూరు ప్రాధికార సంస్థలో ఏజెంట్ గా పని చేయడం మొదలెట్టాడు. అక్కడ ఎదిగి బాగా సంపాదించాడు. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించాడు. ఇంత ఆడంబరంగా చేస్తే ఐటీ సమస్యలు రావా అనుకుంటున్నారా ?. ఇదే ప్రశ్న ఆయన్ని వేస్తే అంతా న్యాయబద్ధంగా, పన్నులు కట్టి సంపాదించిందే. అందుకే ఏ భయం లేకుండా వరలక్ష్మి పూజ చేశానని చెప్తున్నాడు సూరి.
మరిన్ని వార్తలు: