ప్రగతి భవన్ వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. చందర్ అనే ఆటో డ్రైవర్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించకోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు.
తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు లేవు.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదంటూ చందర్ నిరసన తెలిపాడు. తెలంగాణ కోసం 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని అతను చెప్పుకొచ్చాడు. చందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కిసాన్ విభాగం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్టయ్యారు.