భారత వైద్యునికి బ్రిటన్‌లో అరుదైన పురస్కారం

భారత వైద్యునికి బ్రిటన్‌లో అరుదైన పురస్కారం

భారత సంతతికి చెందిన వైద్యునికి బ్రిటన్‌లో అరుదైన పురస్కారం దక్కింది. కరోనావైరస్‌ సంక్షోభంలో చేసిన సేవలకుగానూ నాడీ సంబంధిత వ్యాధుల నిపుణుడు రవి సోలంకికి బ్రిటన్‌ రాయల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రత్యేక అవార్డు లభించింది. కరోనా రోగులకు వైద్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు.

అలాగే మెషిన్‌ లర్నింగ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న రేమండ్‌ సీమ్స్‌తో కలిసి న్యూనేషన్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) స్వంస్చంధ సంస్థ హీరోస్‌ కోసం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించి కోవిడ్‌ వ్యాధికి సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చినట్లు అకాడమీ ప్రతినిధులు తెలిపారు.

రికార్డ్‌ టైంలో సమర్థవంతమైన వెబ్‌సైట్‌ను నెలకొల్పి కరోనా వారియర్లలకు సేవలందిచినందుకుగాను ఈ అవార్డు వారికి దక్కింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా స్వచ్ఛంధంగా నిధులను సేకరించడంతో పాటు, కరోనాపై కౌన్సిలింగ్‌, కోవిడ్‌ బాధితులకు మద్దతుగా నిలిచిన ఎన్‌హెచ్‌ఎస్‌ కార్మికులకు పీపీఈ కిట్లను అందించడంతో తీవ్రంగా కృషి చేశారు. రవితో పాటు మరో 19 మంది కూడా ఈ పురస్కారానికి ఎంపియ్యారు.