ఎపుడొచ్చామన్నది కాదు.. హిట్ కొట్టామా లేమా అనేది సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్టయిల్. కొత్త వాళ్లతో ప్రయోగాలు.. చాలా కూల్‌గా , అంతే డీప్‌గా ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోవడం ఆయన శైలి. సిల్వర్ స్క్రీన్‌పై ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ.. జానర్ ఏదైనా అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాడు శేఖర్ కమ్ముల. ఫిబ్రవరి 4 మిస్టర్ కూల్ డైరెక్టర్ శేఖర్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ స్టోరీ..
‘డాలర్ డ్రీమ్స్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న జన్మించారు. తొలి సినిమాతోనే ఫస్ట్ సినిమాతోనే పలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.అచ్చతెలుగు తియ్యదనం, విలువలకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు సినిమాకు వన్నెలద్దిన అతికొద్దిమందిలో శేఖర్ కమ్ముల ఒకరు. సిల్వర్ స్క్రీన్ పై తన దర్శక ప్రతిభతో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే ఐనా తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో మంచి కాఫీ లాంటిమూవీల నుంచి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఆనంద్, గోదావరి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్‌స్టోరీ లాంటి సినిమాలను భారీ విజయాలను సాధించాయి. అటు మిడిల్ క్లాస్ వారైనా ఇటు యూత్ ప్రేక్షకులైనా ఫిదా అవ్వాల్సిందే. సకుటుంబ సపరివారం సమేతంగా థియేటర్ల ముందు జనం క్యూ కట్టాల్సిందే. తనకేసొంతమైన టేకింగ్‌తో ఏకంగా ఆరు నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు. దటీజ్ దర్శక లీడర్ శేఖర్ కమ్ముల. అంతేకాదు ప్రముఖ దర్శకుడు బాపు, విశ్వనాథ్ తరువాత హీరోయిన్‌ను అందంగా, ఆత్మవిశ్వాసంగా ప్రొజెక్ట్ చేసిన ఘనత శేఖర్‌దే అని కచ్చితంగా చెప్పవచ్చు. అందంగా లేనా అంటూ తనదైన మేకింగ్ స్టైల్‌తో అదరగొట్టేస్తాడు.
పాపికొండల అందాలు, ఉప్పొంగే గోదావారితో పాటు హీరోయిన్ కమలినీ ముఖర్జీని తనదైన శైలిలో అందంగా చూపించాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా కమర్షియల్‌గా గ్రాండ్ సక్సెస్ కాలేపోయిప్పటికీ బెస్ట్ దర్శకుడుగా నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఆ తరువాత అందరూ కొత్త నటులతో చేసిన హ్యాపీడేస్‌తో సూపర్ డూపర్ హిట్‌కొట్టాడు.ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకుంది ఈ సినిమా ద్వారా పరిచయం అయిన నటులు స్టార్స్‌గా ఎదిగారు. అవకాయ్ బిర్యాని మూవీ కూడా పెద్దగా విజయం సాధించలేదు.
పాలిటికల్ జానర్‌లో దగ్గుబాటి రానాను హీరోగా పరిచయం చేసిన మూవీ లీడర్. ఈ మూవీ విమర్శలకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. బెస్ట్ స్టోరీ రైటర్‌గా ఈ సినిమాకు శేఖర్ కమ్ముల నంది అవార్డు అందుకున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’, అలాగే కహానీ సినిమాకు రీమేక్‌గా తెలుగులో నయనతార కథానాయికగా వచ్చిన ‘అనామిక’ కూడా నిరాశపర్చాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్, సాయిపల్లవి జోడీగా వచ్చిన ‘ఫిదా’ మూవీ ఆడియన్స్‌ను ఫిదా చేసింది. తెలంగాణ, అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది. ఇక తాజాగా నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సినిమా హిట్టా ఫట్టా అనేది తనకు తెలిసిపోతుందని ఒక సందర్భంలో శేఖర్ కమ్ముల చెప్పారు. తన కథల్ని పెద్ద హీరోలు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే తనకు కథని నేరేట్ చేయడం రాదు. తాను స్టోరీ చెప్తుంటే వినేవాళ్లకి ఆవలింతలు వస్తాయని చమత్కరించారు హ్యాపీడేస్ సినిమా ట్రెండ్ సెట్టర్ అని బల్లగుద్ది మరీ చెప్పాను. అలాగే పాలిటిక్స్ సినిమాల్లో లీడర్ నిలబడుతుందన్నా. బట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ దెబ్బతీసిందంటూ తన అనుభవాలను గతంలో గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే.