మన ఆయుర్వేదంతో కరోనాకు చెక్.:బ్రిటన్ యువరాజుకు పని చేసిన ఆయుర్వేదం

ప్రపంచమంతా కరోనా వైరస్ తో గజగజలాడుతోంది. ఇదే సమయంలో ఈ వైరస్ బారిన పడ్డ వారు ఎంతో మంది మరణిస్తున్నారు. దీంతో ప్రజలు కలవరపాటుకు గురౌతున్నారు. తాజాగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్‌ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అదీ ఎలాగంటే… మన ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స ద్వారా బ్రిటర్ యువరాజుకు కరోనా తగ్గిపోయిందని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు.

తాజాగా శ్రీపాద్ నాయక్ మాట్లాడుతూ.. బ్రిటన్ యువరాజ్ చార్లెస్ కు మన ఆయుర్వేదంతో కరోనా తగ్గిందని అన్నారు. అలాగే.. బెంగళూరులోని సౌక్య అనే రిసార్ట్ నుంచి ఆయనకు వైద్య సేవలు అందించారని వెల్లడించారు.  సౌక్య ఆయుర్వేద రిసార్ట్ డాక్టర్ ఐజాక్ మత్తయ్య స్వయంగా ఈ విషయాన్ని తనకు ఫోన్ చేసి తెలిపారని కూడా స్పష్టం చేశారు.

అయితే డాక్టర్ మత్తయ్య ఏమన్నారు అంటే తాను ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స ద్వారా ప్రిన్స్ ఛార్లెస్‌కు చికిత్స చేశానని.. అది విజయవంతమైందని స్పష్టం చేసినట్లు మంత్రి శ్రీపాద నాయక్ వివరించారు. అంతేకాకండా ప్రిన్స్ ఛార్లెస్‌కు జరిగిన చికిత్సపై అధ్యయనం చేయాలని తన మంత్రిత్వ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ చికిత్స విధానం, ప్రక్రియలపై నివేదికను సమర్పించాలని కూడా డాక్టర్ మత్తయ్యను కోరినట్లు వెల్లడించారు. కాగా.. ప్రిన్స్ ఛార్లెస్, ఆయన సతీమణి కెమెల్లా క్వారంటైన్ పాటించగా.. ఆమెకు కరోనా వైరస్ నెగెటివ్ రావడం వేశేషం.