మందు వికటించి ఒకరు మృత్యువాత

మందు వికటించి ఒకరు మృత్యువాత

అనారోగ్యానికి గురి కాకుండా తీసుకున్న మందు వికటించి ఒకరు మృత్యువాత పడగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్న సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ. పరుశురామ్‌ వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం చంద్రనగర్‌లో నివసించే నరేష్‌కుమార్‌, ప్రైవేట్‌ ఉద్యోగి. ఇదిలా ఉండగా ఓ చానల్‌లో సూచించిన ఆయుర్వేద మందు తీసుకుంటే కరోనాతో పాటు ఎలాంటి వ్యాధులు దరిచేరవని భావించి నరేష్‌కుమార్‌ బుధవారం తల్లి లక్ష్మీ, భార్య సంధ్యారాణిలతో కలిసి తాగారు.

కాసేపటి తర్వాత ముగ్గురు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేష్‌కుమార్‌ గురువారం మృతి చెందగా, లక్ష్మీ, సంధ్యారాణి చికిత్స పొందుతున్నారు. మృతుడి సోదరుడి శ్రవణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.