Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బాహుబలి’ చిత్రంకు ఈటీవీలో త్వరలో ప్రారంభం కాబోతున్న స్వర్ణఖడ్గంకు సంబంధం ఉందంటూ సినీ వర్గల్లో ప్రచారం జరుగుతుంది. ఇంతకు ఆ లింక్ ఏంటా అని ప్రస్తుతం అందరిలో చర్చ జరుగుతుంది. బాహుబలి మొదటి పార్ట్ పూర్తి అయిన సమయంలోనే ఇదే కథాంశంతో సీరియల్‌ను హిందీలో తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే హిందీలో సీరియల్ కార్యరూపం ద్చాలేదు. త్వరలో త్వరలో అంటూ నెట్టుకు వస్తున్నారు. తాజాగా తెలుగులో ఆ సీరియల్ తెరకెక్కుతుంది.
బాహుబలి స్టోరీ లైన్‌తోనే స్వర్ణఖడ్గం సీరియల్ తెరకెక్కుతున్నట్లుగా ఈటీవీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. బాహుబలి నిర్మాతలు అయిన శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేనిలు ఈ సీరియల్‌ను నిర్మిస్తున్నారు. తెలుగు బుల్లి తెరపై ఆర్కా మీడియా సంస్థ పలు సీరియల్స్‌ను అందించడం జరిగింది. ఆర్కా మీడియా నుండి రాబోతున్న మరోసీరియల్ స్వర్ణఖడ్గంను అంతా కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ, తెలుగు సీరియల్స్ స్థాయిని మించి తెరకెక్కిన ఈ సీరియల్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సీరియల్ గురించి ఆర్కా మీడియా వారు త్వరలో మరిన్ని విషయాలు వెళ్లడి చేయనున్నారు.