ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పాక్ కెప్టెన్ బాబార్ ఆజం, ఓపెనర్ ఇమాముల్ హక్ వీరోచిత శతకాలతో తమ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరును చేధించింది. మూడు వన్డేల సిరీస్‌ను పాక్ 1-1తో సమం చేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వన్డేల్లో ఒక అరుదైన ఫీట్ సాధించాడు. 83 బంతుల్లో 114 పరుగులు చేసిన బాబర్ వన్డేల్లో 15వ సెంచరీ అందుకున్నాడు. 83 ఇన్నింగ్స్‌ల్లోనే బాబర్ 15 సెంచరీలు సాధించాడు.
తద్వారా అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన బాబర్ ఆజం దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు. అంతకముందు ఆమ్లా 86 ఇన్నింగ్స్ ద్వారా 15వ సెంచరీ సాధించాడు. టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లికి 15వ వన్డే సెంచరీ సాధించడానికి 106 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెన్ మెక్‌డెర్మట్ సెంచరీ సాధించగా…ట్రవిస్ హెడ్ , మార్నస్ లబ్‌షేన్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. షాహిన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు.