పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న బాబర్ అజమ్ తాజాగా టి20ల్లో కొత్త రికార్డు సాధించి చరిత్ర సృష్టించాడు. టి20ల్లో సెంచరీలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. నేషనల్ టి20కప్‌లో భాగంగా సెంట్రల్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బాబర్ అజమ్ నార్తన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.
63 బంతులెదుర్కొన్న అజమ్ 105 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు.. 3 సిక్స్‌లు ఉన్నాయి. అయితే బాబర్ అజమ్ మెరుపు ఇన్నింగ్స్ జట్టును గెలిపించలేకపోయినప్పటికీ కొన్ని రికార్డులు మాత్రం బద్దలు కొట్టాడు.తాజా సెంచరీతో టి20ల్లో అన్ని మ్యాచ్‌లు కలిపి బాబర్ అజమ్ 6 సెంచరీలు సాధించాడు. 193 మ్యాచ్‌ల్లోనే అజమ్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కాగా రోహిత్ శర్మ టి20ల్లో 353 మ్యాచ్‌లాడి 6 సెంచరీలు సాధించాడు. ఇక పాకిస్తాన్‌కే చెందిన అహ్మద్ షెహజాద్, కమ్రాన్ , టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సాధించారు.
తాజాగా బాబర్ అజమ్ విరాట్ కోహ్లిని అధిగమించి రోహిత్‌తో సమానంగా నిలిచాడు. అయితే మ్యాచ్‌ల పరంగా చూస్తే మాత్రం బాబర్ అజమ్ తొలి స్థానంలో ఉన్నాడు.ఇక ఓవరాల్‌గా చూసుకుంటే క్రిస్ గేల్ 448 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. మైకెల్ క్లింగర్ 2వ స్థానం , డేవిడ్ వార్నర్ 306 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలతో మూడో స్థానం, ఆరోన్ ఫించ్ నాలుగు.. లూక్ రైట్ ఐదు.. బ్రెండన్ మెక్కల్లమ్ 370 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలతో ఆరో స్థానంలో ఉన్నారు.