సీఎంవో నుండి బాబు టీం అవుట్….అంతా జగన్ మార్క్ ?

babu team out of CMO

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సచివా లయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న చంద్రబాబు వర్గంగా భావిస్తున్న అధికారులు అందరి మీదా బదిలీవేటు పడింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్‌ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్ర సాద్‌, సీఎం కార్యదర్శి గిరిజా శంకర్‌, రాజమౌళిని బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరం తా సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. తొలిరోజే నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. పరిపాలనపై పట్టు పెంచుకునేందుకే జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అధికారులపై బదిలీ వేటు వేశారు. ఇక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేయగా సీఎం అదనపు కార్యదర్శిగా కె.ధనుంజయరెడ్డిని తొలి నియా మకం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ. సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలి నియామకం ధనుం జయ్‌రెడ్డిదే కావడం విశేషం. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి కార్యదర్శి హోదాలో సీఎంవోలో సేవలు అందించనున్నారు. ప్రస్తుతం ఆయన టూరిజం కార్పొరేషన్‌ లో ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వ్యవ సాయ శాఖ కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి అయినప్పటి నుంచి ధనుంజయ్‌ రెడ్డి జగన్‌ క్యాంపు కార్యాలయంలో తన సేవలను అందిస్తున్నారు. ఇక వైఎస్ జగన్ ఈరోజు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. కాసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయం సీఎం సమావేశం ప్రారంభమైంది.