మ్యాన్‌హోల్‌లో ప‌డ్డ చిన్నారి..

baby fall in drain

ముంబైలోని ఓ మ్యాన్‌హోల్‌లో ఏడాదిన్న‌ర వ‌య‌సున్న చిన్నారి దివ్యాంశ్ ప‌డిపోయాడు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం రాత్రి గోరేగావ్ ఈస్ట్ ప్రాంతంలో జ‌రిగింది. డ్రెయినేజీలో ప‌డ్డ చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ రిలీజైంది. రోడ్డు మీద తిరుగుతున్న చిన్నారి.. ఓ ఎల‌క్ట్రిక‌ల్ బాక్సు ప‌క్క‌న ఉన్న భారీ రంధ్రంలో ప‌డిపోయాయి. ఆ డ్రెయినేజీ సుమారు ఫీట్ల లోతు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ముంబైలో భారీగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో డ్రెయినేజీలో నీరు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న‌ది. తొమ్మిది గంట‌ల నుంచి చిన్నారి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది.