చిన్న సినిమా బేబీ ముందు నిలబడలేకపోయిన ప్రభాస్ ,పవన్ కళ్యాణ్…

tollywood movie Baby
tollywood movie Baby

ఎంత పెద్ద హీరో హీరోయిన్ లు నటించిన అది చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్ సినిమా ఆయన కూడా కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు ఓటు వేస్తారు అన్న విషయం చాలాసార్లు రుజువైంది.పెద్ద హీరోలు అయితే ఈ విషయాలను గుర్తించడం లేదో ఏమో కానీ వారి నిర్లక్ష్యమే చిన్న సినిమాల ముందు పెద్ద హీరోల గౌరవాన్ని కించపరిచేలా చేస్తోందని ఇన్సైడ్ టాక్ . ఇక సరిగ్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటిదే జరిగింది. ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే.. అది రోజులతో సంబంధం లేకుండా కలెక్షన్లను సునామి సృష్టిస్తుంది. చిన్న సినిమాలని ,పెద్ద సినిమాలని ఒకేసారి థియేటర్లలో విడుదల చేస్తూఉంటారు. తాజాగా ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి హీరోలు పూర్తిగా అవమానపడ్డారు అనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి.అసలు విషయంలోకెళితే తాజాగా విడుదలైన బేబీ అనే చిత్రం అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. ఆనంద్ దేవరకొండ హీరోగా, యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తాజాగా విడుదలైన చిత్రం బేబీ.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సంచలనం సృష్టించింది.

ఏకంగా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది బేబీ సినిమా. కేవలం కలెక్షన్ల పరంగానే కాదు , పవన్ కళ్యాణ్ నటించిన బ్రో, ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలను కూడా డామినేట్ చేసేసింది. ఈ రెండు సినిమాల కంటే కూడా కొన్ని సెంటర్స్ లలో అదే రోజు బేబీ సినిమాకి ఎక్కువ వసూలు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆరవ రోజు కూడా బేబీ రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేయగా.. ఆది పురుష్ , బ్రో సినిమాలు కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూలు సాధించాయి. ఇక దీంతో చిన్న సినిమా ఆయన బేబీ ముందు పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ కలెక్షన్స్ పరంగా నిలబడలేకపోయారు అనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.