అన్నదమ్ముళ్లుగా చిరు-శర్వా కాంబోలో మూవీ..?

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

టాలీవుడ్​లో మరో సూపర్ క్రేజీ కాంబో రెడీ అవుతోంది. . ఇంతకీ వాళ్లెవరంటే.. మెగాస్టార్ చిరంజీవి-యంగ్ హీరో శర్వానంద్.ఇప్పటికే పలు మల్టీస్టారర్లు టాలీవుడ్​ను షేక్ చేసిన విషయం తెలిసిందే సెకండ్ ఇన్నింగ్స్​లో చిరు.. జెట్ స్పీడులో దూసుకెళ్తున్నారు.

తాజాగా చిరంజీవి మలయాళంలో సూపర్​ హిట్​ అయిన బ్రో డాడీ మూవీ రీమేక్​ చేసేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. మెగాస్టార్​కు జోడీగా త్రిష నటించనున్నారు.అయితే ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత.. నిర్మించనున్నారు.

వీరిద్దరూ గతంలో స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు. దీనికి సంబంధించి ఇప్పుడు మరో అప్డేట్​ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో శర్వానంద్​- చిరంజీవి.. తండ్రీకొడుకులు కాదట. అన్నదమ్ముళ్లుగా నటించనున్నారట.