ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ బాబు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం చీఫ్ జస్టీస్ బోబ్డే నేతృత్వంలో విచారణనూ ప్రారంభించింది. విచారణ పూర్తయ్యాక సీఎం జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి. కాగా ప్రస్తుతానికి భయంకరమైన కరోనా వైరస్ భీకరంగా వ్యాపిస్తున్న కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కోడ్ ని ఎత్తేయాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి, సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రభుత్వానికి ఒక చేదు వార్త చెప్పింది. ఏంటంటే… ఈ సమయంలో రాష్ట్రంలో ఎలాంటి కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టొద్దని ఆదేశించింది. ఇకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి మరొక తేదీని నిర్ణయించాలని ఈసీ కి సూచించింది. అంటే దాదాపు ఆరు వారాల తరువాత రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించేందుకు అన్ని పనులు పూర్తీ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.