హ్యకర్స్ బారిన పెద్ద పెద్ద కంపెనీలు

హ్యకర్స్ బారిన పెద్ద పెద్ద కంపెనీలు

ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ యుగంలో యూజర్ల వివరాలు ఎంత భద్రంగా ఉన్నాయి అనేది మనకు ఒక ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యకర్స్ బారిన పడుతున్నాయి. ఇటీవల ఒక హ్యాకర్ల బృందం డీసెంట్రలైజ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ బాడ్జర్ డీఏఓకు భారీ షాక్‌ ఇచ్చింది. దీంతో సరికొత్త ట్రేడింగ్‌గా మారిన క్రిప్టోకరెన్సీ వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్‌ టెక్నాలజీని కూడా హ్యాకర్లు చేధించారు.

చరిత్రలో మరోసారి 120.3 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. బ్లాక్‌చైయిన్‌ టెక్నాలజీ సంస్థ బాడ్జర్ డీఏఓపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వందల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్‌ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ అందించే బాడ్జర్ డీఏఓ యాప్‌ను హ్యాక్‌ చేసినట్లు ప్రముఖ బ్లాక్ చైన్ సెక్యూరిటీ సంస్థ పెక్ షీల్డ్ మొదట కనుగొంది.

పెక్ షీల్డ్ సంస్థ ఈ హ్యాకింగ్ గురుంచి బయట పెట్టిన తర్వాత సదురు సంస్థ ఈ విషయం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. కస్టమర్లు మరోసారి హ్యాకింగ్ బారిన పడకుండా ఉండటానికి తాత్కాలికంగా లావాదేవీలు నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ సమస్యను దర్యాప్తు చేయడానికి బాడ్జర్ డీఏఓ యుఎస్, కెనడియన్ అధికారులతో పాటు చైన్లాలైసిస్ కంపెనీని కూడా నియమించింది. ఈ మిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని బాధితులకు తిరిగి చెల్లిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

బాడ్జర్ డీఏఓ అనేది ఒక డీసెంట్రలైజ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ. ఈ బాడ్జర్ డీఏఓ అప్లికేషన్లలో వినియోగదారులు రుణాలను పొందడానికి బిట్‌ కాయిన్‌ను తాకట్టు పెట్టుకోవచ్చు. డిఏఓ అనేది ఆటోమేటెడ్ & డీసెంట్రలైజ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ. ఇది బ్లాక్ చైన్ ఆధారిత స్మార్ట్టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ బాడ్జర్ డీఏఓ ఎథెరియం ప్లాట్ ఫారంను నిర్మించారు.