Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏంటండీ ఏప్రిల్ నెల కూడా కాదు ఇప్పుడు ఫూల్ చేస్తున్నారు ఏమిటా అనుకుంటున్నారా అబ్బే అదేమీ లేదండీ నిజంగానే మీరు హాలీం తింటే ఒక నూతన ఐఫోన్ ఎక్స్ పొందే అవకాశాన్ని స్ట్రీట్ బైట్ అందిస్తోంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ తో కలిసి సంయుక్తంగా ఒక కాంటెస్ట్ రన్ చేయనుంది. ఆ కాంటెస్ట్ ప్రకారం ఎవరయితే హాలీం తింటూ సేల్ఫీ తీసుకుని ఫేస్ బుక్ లో కానీ ఇన్స్టా గ్రామ్ #haleemhungama #Bajajelectronics #streetbyte తో ట్యాగ్ చేసి పిక్స్ అప్లోడ్ చేసి ఫేస్ బుక్ లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్, స్ట్రీట్ బైట్ పేజీలు లైక్ చేసి స్ట్రీట్ బైట్ యూ ట్యూబ్ చానెల్ ని సబ్ స్క్రైబ్ చేస్తారో వారిలో 30 మందిని లక్కీ డ్రా తీసి హైదరాబాద్ లో జరగనున్న లైవ్ హలీం కాంటెస్ట్ కి పంపుతారు. ఆ లైవ్ కాంటెస్ట్ లో ఎవరయితే హలీం ముందుగా తింటారో వారిని విజేతగా ప్రకటించి వారికి ఐఫోన్ ఎక్స్ అందచేస్తారట. వారి తర్వాత వారికి ఐఫోన్ 8 తర్వాత వారికి ఐఫోన్ 7 అందచేయనున్నారు స్ట్రీట్ బైట్ చానల్ వారు. ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని హలీం పాయింట్ లకి పరిగెత్తండి మరి.
స్ట్రీట్ బైట్ : ప్రవృత్తే వృత్తిగా
ఎంబీయే పూర్తి చేసిన వారిద్దరూ ఏదోలా బతికెయ్యాలని అనుకోలేదు నలుగురిలో ఒకరుగా బతకాలునుకుని స్ట్రీట్ బైట్ అనే యూ ట్యూబ్ చానెల్ ని స్టార్ట్ చేశారు. ఈ చానెల్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఎక్కడెక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది ? అది తోపుడు బండి అయినా స్టార్ హోటల్ అయినా… బాబాయ్ హోటల్ లాంటి పురాతన హోటల్ అయినా అవి ప్రేక్షకుల ముందుకి తేవడమే లక్ష్యంగా 2014 లో స్టార్ట్ అయింది. యూకేలో ఎంబీయే చేస్తున్న రోజుల నుండే మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అనే వెతుకులాట ప్రారంభించిన రవితేజ్ కి స్నేహితులు ఇచ్చిన ఐడియా ఈ స్ట్రీట్ బైట్. తన స్నేహితుడు అప్పటికే ఒక మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ గా చేస్తున్న ప్రసాద్ కూడా తోడవ్వడంతో ఇద్దరూ ఇక రంగంలోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, ఆయా ఏరియాల్లో మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనే అంశాలు మనం స్ట్రీట్ బైట్ యూ ట్యూబ్ చానెల్ లో చూడవచ్చు.