ఒంగోలు గ్యాంగ్ రేప్ కేస్ లో ప్రధాన నిందితుడు బాజీ

Baji is the main accused in the Ongole gang rape case

ఒంగోలులో బాలిక పై గ్యాంగ్ రేప్ నకు గురైన ఘటన సంచలన రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఒంగోలు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వివరించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 16న తన పరిచయస్థుడిని కలిసేందుకు ఆ బాలిక ఒంగోలు వచ్చిందని చెప్పారు. బస్టాండ్ లో ఆ బాలికను గుర్తించిన సెల్ ఫోన్ మెకానిక్ బాజీ వికలాంగుడు_తన గదికి తీసుకెళ్లాడని, తన ఆరుగురు స్నేహితులతో కలిసి నిన్నటి వరకూ ఆమె అత్యాచారం చేశారని అన్నారు. బస్టాండ్ లో ఏడుస్తున్న బాలికను హోంగార్డు వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడని, ఈ ఘటనపై శక్తి బృందానికి సమాచారం ఇచ్చారని చెప్పారు. ఈ బృందం సహకారంతో నిన్న నలుగురు నిందితులను, మరో ఇద్దరిని ఈరోజు అరెస్టు చేశామని చెప్పారు. రైల్లో ఎక్కి పారిపోయేందుకు యత్నించిన నిందితుడిని బిట్రగుంట వద్ద పట్టుకున్నట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు అని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ బాజీగా గుర్తించామని, ఏ1 షేక్ బాజీ, ఏ2 శ్రీనివాస్, ఏ6 మహేశ్ అని వివరించారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినట్టు సిద్దార్థ్ కౌశల్ చెప్పారు.