నందమూరి హీరో బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో బాలయ్య కేర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు కేర్ ఆసుపత్రి వైద్యులు ఆయన హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని కూడా వైద్యులు స్పష్టం చేశారు.